Warangal: 31వ డివిజన్‌లో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం!
Warangal: గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధిలో అర్బన్ మలేరియా విభాగం, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Warangal: 31వ డివిజన్‌లో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం!
వరంగల్: ఈరోజు 31వ డివిజన్ పరిధిలో అర్బన్ మలేరియా విభాగం, GWMC సిబ్బంది ఆధ్వర్యంలో దోమల నివారణకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు గారు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి తొట్టెలు, పాత్రలకు తప్పనిసరిగా మూతలు పెట్టాలి. నిల్వ ఉన్న నీటిని వారానికి ఒకసారి మార్చాలి.
తొట్టెల అడుగు భాగాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవాలి. పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలి. మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యవంతమైన 31వ డివిజన్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మామిండ్ల రాజు గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




