Warangal: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: తొలి ఓటర్ నమోదు దరఖాస్తు సమర్పణ!
Warangal: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ఓటర్ నమోదు దరఖాస్తును అదనపు కలెక్టర్ రవికి అందజేసిన రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాసరావు.
Warangal: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: తొలి ఓటర్ నమోదు దరఖాస్తు సమర్పణ!
వరంగల్: వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తొలి ఓటర్ నమోదుకు సంబంధించిన దరఖాస్తును అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డిలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తూ, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని శ్రీనివాస్ రావు కోరారు.




