Warangal: అసంపూర్తి డబుల్ బెడ్‌రూంలతో కుడా మోసం: నిర్వాసితుల ఆవేదన

Warangal: భద్రకాళి మాడవీధుల విస్తరణలో భాగంగా చేరబండ రాజు కాలనీలో గుడిసెలు కూల్చివేసి అసంపూర్తి డబుల్ బెడ్‌రూంలు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 8 Oct 2026 8:17 PM IST
Warangal
X

Warangal: అసంపూర్తి డబుల్ బెడ్‌రూంలతో కుడా మోసం: నిర్వాసితుల ఆవేదన

వరంగల్: నగర నడిబొడ్డున ఉన్న చేరబండ రాజు కాలనీ నిర్వాసితులు విలేకరుల సమావేశంలో తమ ఆవేదన వెళ్లగక్కారు. KUDA అధికారులు తమను మోసం చేశారని, కనీస వసతులు లేని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.

22 వేల జీతంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అని చెప్పి 14 వేల జీతం ఇచ్చారని వాపోయారు. HRC ఆదేశాలు ఉన్నా అర్ధరాత్రి పోలీసులతో గుడిసెలు కూల్చారని, మహిళలపై పురుష పోలీసులు దాడి చేశారని ఆరోపించారు.

మా ప్రాణాలు పోయినా కదిలేది లేదు, మా సమాధులపైనే భద్రకాళి మాడవీధులు కట్టుకోండంటూ మహిళలు కన్నీరుమున్నీరయ్యారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST