Warangal: పేదలకు ఇందిరమ్మ కుటుంబ బీమా కొండంత అండ

Warangal: వరంగల్ డీసీసీ భవన్‌లో నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా రూ.5 లక్షల పథకం కొండంత అండని డీసీసీ అధ్యక్షుడు అయూబ్ అన్నారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 14 Nov 2026 7:53 PM IST
Warangal
X

Warangal: పేదలకు ఇందిరమ్మ కుటుంబ బీమా కొండంత అండ

వరంగల్: పేద కుటుంబాలకు కొండంత అండగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా రూ. 5 లక్షల పథకం భారతదేశంలోనే ఆదర్శంగా నిలవనున్న ప్రజా సంక్షేమ కార్యక్రమమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు.

శుక్రవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, డిసిసి భవన్ లో భారత తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుడు, నవ భారత నిర్మాత నెహ్రూ స్వాతంత్ర్యానంతరం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. భారీ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పునాదులు వేసి ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని కొనియాడారు.

ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద భరోసా కల్పిస్తుందని, కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా సాయం అందుతుందని వివరించారు. ఈ పథకం తెలంగాణలో ప్రజా సంక్షేమానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ నమిల్ల శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ చాంద్ పాషా, అక్మల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST