Warangal: జాతీయ రహదారులపై ప్రమాద స్థలాలను పరిశీలించిన వరంగల్ సీపీ!
Warangal: వరంగల్-ఖమ్మం, కరీంనగర్ జాతీయ రహదారులపై 22 ప్రమాద స్థలాల గుర్తింపు సీపీ ఎన్.శ్వేత ఐపీఎస్ క్షేత్రస్థాయి పరిశీలన, తక్షణ రోడ్డు భద్రతా చర్యలకు ఆదేశం.
Warangal: జాతీయ రహదారులపై ప్రమాద స్థలాలను పరిశీలించిన వరంగల్ సీపీ!
వరంగల్: ప్రమాద స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వరంగల్ సీపీ ఎన్.శ్వేత, ఐపీఎస్, రోడ్డు ప్రమాదాలకు గల ప్రధాన కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 14 ప్రాంతాలను మరియు వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై 8 ప్రాంతాలను ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించి, పరిశీలించారు.
ఆధికారిక లెక్కల ప్రకారం గడిచిన మూడు సంవత్సరాలలో వరంగల్ కమిషనరేట్ పరిదిలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి లో 108 రోడ్డు ప్రమాదాలు జరిగి, అందులో 80 మంది మరణించినట్లు, వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై 79 రోడ్డు ప్రమాదాలు జరిగి, అందులో 37 మంది మరణించినట్లు తెలిపారు.
ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను సీపీ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ పరిశీలనలో NHAI, R&B, మున్సిపల్, రవాణా, ఎక్సైజ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




