Warangal: భద్రకాళి నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ!

Warangal: వరంగల్ భద్రకాళి ఆలయంలో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 6 Oct 2026 5:53 PM IST
Warangal
X

Warangal: భద్రకాళి నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ!

Warangal: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 11 వ తేదీ నుండి ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ తరపున చేపడుతున్న చర్యలను సిపి గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు మరియు భద్రతా విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ, మట్టెవాడ, ఇంతేజర్ గంజ్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్లు, ఆలయ పాలక మండలి, అర్చకులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.