Warangal: వరంగల్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలు!

Warangal: వరంగల్ ఆరెంజ్ అలెర్ట్ ఉన్నప్పటికీ వినాయక నిమజ్జన విధుల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది; భక్తులు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద విజ్ఞప్తి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 24 Sept 2026 8:03 AM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలు!

Warangal: వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ఉన్నప్పటికీ, వర్షాన్ని లెక్కచేయకుండా అధికారులు, సిబ్బంది వినాయక నిమజ్జన వేడుకల్లో విధులు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారని పేర్కొన్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిమజ్జనానికి తీసుకువచ్చే వినాయక విగ్రహాలను త్వరితగతిన నిమజ్జనం చేసేలా భక్తులు, నిర్వాహకులు అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

నిమజ్జన ఘట్టం వద్ద ఎక్కువసేపు గుమిగూడకుండా, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా..సకాలంలో నిమజ్జనం చేసేందుకు అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా అధికారులు, సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నందున, నిమజ్జన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.