Warangal: పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం: కలెక్టర్ సత్య శారద!
Warangal: పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమని శుక్రవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రంథాలయ వారోత్సవాల్లో అన్నారు.
Warangal: పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం: కలెక్టర్ సత్య శారద!
వరంగల్: పుస్తకాలు మనకు మంచి స్నేహితులని, పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందడంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ, వరంగల్ మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నిర్వాహకులను అభినందించారు.
విద్యార్థినులకు పుస్తకమే ఒక మంచి స్నేహితులు అవ్వాలి... పుస్తలకులు చదవటం వలన విద్యార్థులు మేధాశక్తి పెంపొందుతుందని, గ్రంథాలయాల పాఠకుల సంఖ్య పెరిగేలా విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన పెంచాలన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని, మంచి ఆలోచనా విధానం అలవడుతుందని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రేమలత, ఎంఈఓ వెంకటేశ్వరరావు, వ్యాఖ్యాత, ఉపాధ్యాయులు ఠయ్యాల శ్రీధరాచార్యులు, గ్రంథపాలకులు అమీనా, చిన్నబాబు, రామచంద్రం, ప్రత్యూష, అశోక్, లక్ష్మీనారాయణ, రాంబాబు, రాజమౌళి, సిబ్బంది అరుణ, లలిత, రజిత, లక్ష్మి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




