Warangal: ఎమ్మెల్సీ ఓటు హక్కుపై అవగాహన ఉండాలి: కలెక్టర్ సత్య శారద!
Warangal: వరంగల్‌లో స్వీప్ ఆధ్వర్యంలో ఓ సిటీ నుంచి కాశీబుగ్గ వరకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన ర్యాలీ జరిగింది. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద కోరారు.
Warangal: ఎమ్మెల్సీ ఓటు హక్కుపై అవగాహన ఉండాలి: కలెక్టర్ సత్య శారద!
వరంగల్, నవంబర్ 2: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వీప్ (SVEEP) కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ ఓ సిటీ నుంచి కాశీబుగ్గ సర్కిల్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఓటరు నమోదు ప్రక్రియపై సరైన అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, ఓటు హక్కు వినియోగంపై ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
స్వీప్ కార్యక్రమాల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, డియార్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ వసంత, స్వీప్ నోడల్ అధికారి.. మరియు తదితరులు పాల్గొన్నారు.




