Warangal: వరంగల్ బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలి: సుధారాణి!

Warangal: వరంగల్ బస్ స్టేషన్ ఆధునికీకరణ పనులను కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Oct 2026 2:56 PM IST
Warangal
X

Warangal: వరంగల్ బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలి: సుధారాణి!

వరంగల్: వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్మాణంలో ఉన్న బస్ స్టేషన్ పనులను, వాటి పురోగతిని హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయితో కలిసి కుడా ఛైర్ పర్సన్ పరిశీలించారు. బస్ స్టేషన్ నిర్మాణ, అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు.

పనుల పురోగతిని గురించి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ బస్ స్టేషన్ త్వరగా పూర్తయ్యే విధంగా నిర్మాణ పనులు సాగాలన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయడంలో భాగంగా అదనంగా మరింత మంది వర్కర్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. కాలమ్స్, స్లాబ్స్ రిటెయినింగ్ వాల్ పనులను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కుడా ఈఈ భీమ్ రావు, డీఈ జలాలుద్దీన్, ఇతర అధికారులతో పాటు సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.