Warangal: వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ

Warangal: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో మామునూరు పోలీసులు, ఎంజీఎం వైద్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. 150 యూనిట్ల సేకరణ.

Narender, Staff Reporter  -Warangal
Published on: 29 Oct 2026 7:29 PM IST
Warangal
X

Warangal: వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ

వరంగల్: 'పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు' కార్యక్రమంలో భాగంగా,వరంగల్ సీపీ ఎన్.శ్వేత ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో మామునూరు సబ్ డివిజన్ పోలీసు లు MGM ఆసుపత్రి వైద్యుల సహకారంతో బొల్లిగుంట వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ శిబిరాన్ని వరంగల్ తూర్పు జోన్ డీసీపీ శ్రీ అంకిత్ కుమార్ ప్రారంభించినారు. రక్తదాతలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వారు పండ్లు, పండ్ల రసాలు (జ్యూస్) ఇతర అల్పాహార పదార్థాలను అందజేశారు.

ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేశారన్నారు .

ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ శ్రీ ఎన్. వెంకటేష్, ఎంజీఎం ఆసుపత్రి వైద్య బృందం. వాగ్దేవి కళాశాల ఫార్మ్‌డీ ప్రిన్సిపాల్ కమల్ యాదవ్, మామునూరు, ఏనుమాముల, గీసుకొండ సీఐ లు , సంగెం పర్వతగిరి, ఏనుమాముల,, మామునూరు ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.