Warangal: హంటర్ రోడ్డు నివాసంలో ఘనంగా రావు పద్మ రెడ్డి బతుకమ్మ పూజలు
Warangal: హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి కుటుంబ సభ్యులు, మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు.
Warangal: హంటర్ రోడ్డు నివాసంలో ఘనంగా రావు పద్మ రెడ్డి బతుకమ్మ పూజలు
Warangal: తెలంగాణ ప్రజల విశిష్ట సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన "సద్దుల బతుకమ్మ" వేడుకలను బిజెపి రాష్ట్ర నాయకురాలు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు హనుమకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న తన నివాసంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులు, స్థానిక అపార్ట్మెంట్ వాసులతో కలిసి స్వయంగా తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల సహజసిద్ధమైన పూలతో తీరొక్క బతుకమ్మను పేర్చారు.
అనంతరం అపార్ట్మెంట్ మహిళలందరితో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ వలయంగా తిరుగుతూ, భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ గౌరమ్మను పూజించారు.
శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు మాట్లాడుతూ
"ప్రకృతిని దైవంగా భావించి పూజించే ఏకైక విశిష్ట పండుగ మన బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియడంతో ప్రతి ఇంటా పండుగ శోభ సంతరించుకుంది అని, తెలంగాణ ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో తులతూగాలని, ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని, అలాగే ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు."
ఈ వేడుకల్లో రావు పద్మ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ మహిళలు మరియు స్థానిక ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలను విజయవంతం చేశారు.




