Warangal: పండ్ల మార్కెట్ సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

Warangal: వరంగల్ పండ్ల మార్కెట్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ సందర్శించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 14 Nov 2026 7:42 PM IST
Warangal
X

Warangal: పండ్ల మార్కెట్ సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

వరంగల్: నగరంలోని పండ్ల మార్కెట్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు ఈరోజు పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు, రైతులు మరియు బిజెపి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మార్కెట్‌లోని వ్యాపారులు, రైతులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

-ప్రభుత్వాలు మారుతున్నా మారని వ్యాపారుల బతుకులు:

గత ఐదేళ్లుగా హామీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వరంగల్ పండ్ల మార్కెట్ వ్యాపారుల జీవితాలు మాత్రం మారడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మార్కెట్‌ను కూల్చివేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పి మౌనంగా ఉండిపోయింది. కేవలం హామీలతో ఓట్లు అడగడం కాదు, చేతల్లో అభివృద్ధి చూపించాలని డిమాండ్ చేస్తున్నాము.

-అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్

మార్కెట్ పనులు:

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో 4.16 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 24 కోట్ల వ్యయంతో సమీకృత (ఇంటిగ్రేటెడ్) వెజ్ మరియు నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో పండ్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా 85 గదులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ముందు హడావుడిగా పనులు ప్రారంభించి, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు పూర్తికాలేదు.

-కాగితాలకే పరిమితమైన ప్రత్యేక పండ్ల మార్కెట్:

హైదరాబాద్ కోహెడ తరహాలో వరంగల్‌లోనూ అంతర్జాతీయ స్థాయి ప్రత్యేక పండ్ల మార్కెట్ నిర్మిస్తామని గత పాలకులు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.

-కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మరియు బిల్లుల పెండింగ్:

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న, అసంపూర్తిగా ఉన్న మార్కెట్ పనులను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారు పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీనివల్ల నిర్మాణాలు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరే ప్రమాదం ఏర్పడింది.

-నిర్మాణంలో ఉన్న 85 గదులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? పాత మార్కెట్ వ్యాపారులకు మరియు రైతులకు ఏ ప్రాతిపదికన వాటిని కేటాయిస్తారు? అనే విషయాలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

-వరంగల్ పండ్ల మార్కెట్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్ల ఎన్నో వేల మంది వ్యాపారస్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక, సరైన షెడ్లు అందుబాటులో లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వ్యాపారాలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పండ్లను అమ్ముకోవడానికి వచ్చే రైతులు, కొనుగోలుదారులు నరకయాతన అనుభవిస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

-బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అభివృద్ధి పేరుతో ఉన్న పాత పండ్ల మార్కెట్‌ను కూల్చివేశారని, కానీ కొత్త మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారని విమర్శించారు. దీనివల్ల వ్యాపారులు, రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

-అదేవిధంగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఈ సమస్యపై ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండటం శోచనీయమని బీజేపీ నేతలు మండిపడ్డారు.ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, అసంపూర్తిగా ఉన్న పండ్ల మార్కెట్ పనులను పట్టించుకోకపోవడం తగదని అన్నారు.

-రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పండ్ల మార్కెట్ యజమానులు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గంట రవికుమార్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందా, లేక వ్యాపారులమే సొంతంగా నిర్మించుకోవాలా అనే సందిగ్ధంలో వారు ఉన్నారని తెలిపారు. వరంగల్ వ్యాపారుల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని, వారి సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతు బీజేపీదని, వ్యాపారుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పండ్ల మార్కెట్ అధ్యక్షులు వెల్ది సాంబయ్య, అధ్యక్షులు మల్లారెడ్డి, మార్కెట్ వ్యాపార కమిటీ సభ్యులు మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, జలగం రంజిత్ రావు, రత్నం సతీష్ షా, గురుమూర్తి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, రాష్ట్ర, జిల్లా నాయకులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, బైరి మురళీకృష్ణ, బండి సాంబయ్య యాదవ్, బైరి శ్యాంసుందర్, మాచర్ల దీన్ దయాళ్, జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, కందిమల్ల మహేష్, బైరి నాగరాజు, జిల్లా కార్యదర్శిలు గోకే వెంకటేష్, గుడిపూడి రాధాకృష్ణ, పోనుగోటి వెంకట్రావు, అంకాల జనార్ధన్, నోముల రతన్, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు మాదాసు రాజు, కూచన క్రాంతి కుమార్, టేకుమట్ల రేణుక, ఎర్రగోల్ల భరత్ వీర్, రాష్ట్ర వివిధ మోర్చా నాయకులు గడ్డం మహేందర్, బోడ విజయ్, దామెర సదానందం, ఉసిల్ల దయాకర్, మార్త ఉషారాణి, గరిగే మాధవి మరియు మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, సీత నాగరాజు, రాజశేఖర్ మరియు జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST