Warangal: సీపీఐ నేత మేకల రవి కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
Warangal: వరంగల్ శివనగర్‌లో మృతిచెందిన సీపీఐ రాష్ట్ర నేత మేకల రవి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు.
Warangal: సీపీఐ నేత మేకల రవి కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగర్ ప్రాంతానికి చెందిన సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకులు మేకల రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నేడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్ పటేల్, స్థానిక నాయకులు చింతల నవీన్, నందు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.




