Warangal: వరంగల్‌లో విద్యుత్ కోతలపై బీజేపీ కిసాన్ మోర్చా నిరసన!

Warangal: వరంగల్ తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ కోతలపై రైతుల ధర్నా. కాంగ్రెస్ పాలనపై బీజేపీ నేతల మండిపాటు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 9 Oct 2026 3:05 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో విద్యుత్ కోతలపై బీజేపీ కిసాన్ మోర్చా నిరసన!

Warangal: అధికారంలోకి వస్తే రైతులకు స్వర్గధామం చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు అన్నదాతలను నట్టేట ముంచిందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం నరసయ్య, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, అనాలోచిత విధానాల వల్లే నేడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని మండిపడ్డారు.

ప్రోగ్రాం కన్వీనర్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి నేతృత్వంలో మరియు కిసాన్ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షులు దండు కిషన్ ఆధ్వర్యంలో ఖమ్మం హైవే రోడ్డులోని తిమ్మాపురం సబ్స్టేషన్ వద్ద రైతులు, కిసాన్ మోర్చా నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఆందోళన కార్యక్రమానికి బస్వాపురం లక్ష్మీ నరసయ్య, గంట రవికుమార్, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మార్తనేని ధర్మారావు, కొండేటి శ్రీధర్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా బస్వాపురం నరసయ్య మాట్లాడుతూ, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు కనీసం 5-6 గంటలు కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వలేక చేతులెత్తేసారని విమర్శించారు. కాంగ్రెస్ మార్క్ తుగ్లక్ పాలన వల్ల సకాలంలో విద్యుత్ అందక, బోర్ల కింద నీరు లేక వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 'రైతు ప్రభుత్వం' కాదు, రైతుల రక్తం తాగే 'రాబందుల ప్రభుత్వం' అని దుయ్యబట్టారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయాలని, లేనిపక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి అధికార దాహం తప్ప రైతుల సంక్షేమం పట్టదని విమర్శించారు. వరంగల్ జిల్లాలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారి, చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే పాలకులు ఏసీ రూముల్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ఓట్లేసినందుకు ఈరోజు రైతులు రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎండిపోయిన ప్రతి ఎకరా వరి పంటను అధికారులు తక్షణమే సర్వే చేసి, బాధిత రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిసర ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యుత్ అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. రైతుల కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు బీజేపీ మరియు కిసాన్ మోర్చా విశ్రమించబోదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్లు మర్తనేని ధర్మారావు, గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పడమట జగన్మోహన్ రెడ్డి, దేవర శీను, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతనకంటి శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, యాదగిరిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, జలగం రంజిత్ రావు, సిద్ధం నరేష్, ముత్తిరెడ్డి కేశవ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు బన్న ప్రభాకర్, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, అమృత రావు, మరియు వరంగల్ జిల్లా బిజెపి పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST