Warangal: వరంగల్ రంగసముద్రం చెరువు వద్ద కొండచిలువ కలకలం!

Warangal: వరంగల్ రంగసముద్రం చెరువు వద్ద చేపల వలలో 7 అడుగుల కొండచిలువ చిక్కింది. అటవీ శాఖ అధికారులు దాన్ని సురక్షితంగా జూ పార్క్‌కు తరలించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 13 Oct 2026 10:21 AM IST
Warangal
X

Warangal: వరంగల్ రంగసముద్రం చెరువు వద్ద కొండచిలువ కలకలం!

Warangal: వరంగల్ రంగసముద్రం చెరువు వద్ద కొండచిలువ కలకలం వలకు చిక్కిన 7 అడుగుల కొండచిలువ - అటవీ శాఖకు సమాచారం వరంగల్ ఉరుసు, రంగసముద్రం (రంగా) చెరువు వద్ద భారీ కొండచిలువ కలకలం రేపింది.

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వేసిన వలకు 7 అడుగుల పొడవు, 15 కిలోల బరువున్న కొండచిలువ చిక్కుకుంది. దీంతో ఆందోళనకు గురైన మత్స్యకారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా బయటకు తీసి జూ పార్క్ లో వదిలిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST