Wanaparthy: శాశ్వత షాపులు ఇచ్చేదాకా అండగా ఉంటాం: ఎమ్మెల్యే!

Wanaparthy: వనపర్తిలో రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన పండ్ల వ్యాపారులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యామ్నాయ స్థలం, శాశ్వత షాపుల ఏర్పాటుపై స్పష్టమైన భరోసా ఇచ్చారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 3 Nov 2026 10:18 PM IST
Wanaparthy
X

Wanaparthy: శాశ్వత షాపులు ఇచ్చేదాకా అండగా ఉంటాం: ఎమ్మెల్యే!

వనపర్తి: వనపర్తి పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొత్త బస్టాండ్ సమీపంలోని పండ్ల వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే పండ్ల వ్యాపారులకు శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ ఇవ్వడంతో వ్యాపారులందరూ అంగీకరించి, రోడ్డు విస్తరణకు స్వచ్ఛందంగా సహకరించారు.

ఈ నేపథ్యంలో శాశ్వత దుకాణాల నిర్మాణం పూర్తయ్యే వరకు పండ్ల వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మంగళవారం నందిహిల్స్‌లోని తన నివాసంలో కొత్త బస్టాండ్ పండ్ల వ్యాపారులను పిలిపించి మాట్లాడిన ఆయన, కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పండ్ల వ్యాపారం చేసుకునేందుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

రోడ్డు విస్తరణతో పాటు చిరు వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతో పండ్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకుని, ఉపాధికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY