Jangaon: అమ్మ చావుకి రాని కొడుకుని తరిమికొట్టిన తరిగొప్పుల గ్రామస్తులు!

Jangaon: జనగామ జిల్లా తరిగొప్పులలో తల్లి అంత్యక్రియలకు రాని కొడుకును గ్రామస్తులు నిలదీసి గ్రామం నుంచి పంపించేశారు. గ్రామస్తులే దహన సంస్కారాలు నిర్వహించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 29 Nov 2026 1:51 PM IST
Jangaon
X

Jangaon: అమ్మ చావుకి రాని కొడుకుని తరిమికొట్టిన తరిగొప్పుల గ్రామస్తులు!

Jangaon: అమ్మ చావుకి రాని కొడుకుని తరిమికొట్టిన ఊరు. తరిగొప్పుల గ్రామంలో శనివారం కన్నీళ్లు కాస్తా ఆగ్రహంగా మారాయి. తరిగొప్పుల గ్రామానికి చెందిన కీర్తిశేషులు నాగ బండి రామచంద్రం భార్య పుష్పనీల చనిపోయి వారం అవుతుంది.

పుష్ప నిలకు నలుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉండి కూడా అనాథను చేశారు. గ్రామస్తులే ముందు ఉండి అత్యక్రియలు పూర్తి చేసి మానవత్వం చాటారు. చనిపోయిన రోజు రాకుండా కడసారి చూడ్డానికి కూడా రాని ఆమె కొడుకు, నిన్న గ్రామానికి రాగానే గ్రామస్తులు తరిమికొట్టారు. పుష్పనీల కన్నా తల్లి చనిపోతే, తలకొరివి పెట్టాల్సిన కొడుకు రాలేదు. కన్న బిడ్డలు ఎవరూ పక్కన లేరు.

అప్పుడు ఊరే కొడుకు అయింది. ఊరే కూతురు అయింది. మేమంతా ఆమె బిడ్డలమే అని శవాన్ని భుజాలపై మోసి, ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అంతా అయిపోయాక ఈరోజు కొడుకు ఊర్లోకి వచ్చాడు. అది చూసిన గ్రామస్తులకు రక్తం మరిగిపోయింది. అమ్మ బతికున్నప్పుడు ఎక్కడున్నావ్ చనిపోయినప్పుడు ఎక్కడున్నావ్ ఇప్పుడు ఎందుకొచ్చావ్ ఆస్తి కోసమా అంటూ మహిళలు, యువకులు నిలదీశారు.

తల్లికి తలకొరివి పెట్టని కొడుకు ఈ ఊరికి కూడా రాకూడదు అంటూ గ్రామం నుంచి బయటకు పంపిచారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON