Veldanda: ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ నేతను పరామర్శించిన సర్పంచ్!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణను పరామర్శించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Oct 2026 12:38 PM IST
Veldanda
X

Veldanda: ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ నేతను పరామర్శించిన సర్పంచ్!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాదేపల్లి రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శుక్రవారం పరామర్శించారు. ప్రమాద వివరాల్లోకి వెళ్తే రోడ్డు ప్రమాదంలో బాదేపల్లి రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే యెన్నమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

గాయపడిన రామకృష్ణకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్స్ కు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచి ఎర్ర శ్రీను, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY