Kamareddypally: కామారెడ్డిపల్లిలో వీబీ గ్రామ్ జీ పనులపై అవగాహన!
Kamareddypally: పరకాల మండలం కామారెడ్డిపల్లిలో VBGRAMG ఉపాధి హామీ పనులపై అవగాహన సదస్సు. కొలతల ప్రకారం పనిచేసి రోజువారీ వేతనం రూ. 308 పొందాలని ఏపీవో మార్తా ఇంద్రా సూచన.
Kamareddypally: కామారెడ్డిపల్లిలో వీబీ గ్రామ్ జీ పనులపై అవగాహన!
Kamareddypally: కామారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మార్తా ఇంద్ర పాల్గొని కూలీలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, VBGRAMG (వీబీ గ్రామ్ జీ) పథకం ద్వారా 125 రోజుల పాటు పనులు చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కొలతల ప్రకారం పనులు పూర్తి చేస్తే ప్రతిరోజు రూ. 308 వేతనం వచ్చే విధంగా చూడాలని కూలీలకు వివరించారు.
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా, అందరూ కలిసికట్టుగా పనులు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




