Vardhannapet: ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా.. మార్చురీలో ఎలుకల కలకలం!
Vardhannapet: వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన. బాధ్యత వహిస్తూ సూపరింటెండెంట్ రాజీనామా, ఇన్చార్జిగా డాక్టర్ భరత్ నియామకం.
Vardhannapet: ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా.. మార్చురీలో ఎలుకల కలకలం!
Vardhannapet: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై అధికార యంత్రాంగం స్పందించింది. మార్చురీలో ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడం, పోస్టుమార్టం గది నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలపై చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం.
ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ జిల్లా కలెక్టర్ సత్యశారదకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆస్పత్రి మార్చురీ, పోస్టుమార్టం గది నిర్వహణలో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరిన్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామ్మూర్తి స్పందించి, ఆస్పత్రి పరిపాలనను కొనసాగించేందుకు డాక్టర్ భరత్‌ను తాత్కాలిక ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా నియమించినట్లు సమాచారం.
మృతదేహాల భద్రత, మార్చురీ నిర్వహణ, అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.




