Warangal: వరంగల్ శివనగర్‌లో ఘనంగా శ్రీ వైష్ణవి ప్రతిభా పురస్కారాల వితరణ!

Warangal: వరంగల్ శివనగర్‌లో శ్రీ వైష్ణవి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల పంపిణీ. విద్యార్థులకు నగదు, శాలువాతో సత్కారం చేసిన రాజనాల శ్రీహరి, దరిపెళ్లి సంపత్.

MD. AMEER, WARANGAL EAST
Published on: 11 Oct 2026 6:47 PM IST
Warangal
X

Warangal: వరంగల్ శివనగర్‌లో ఘనంగా శ్రీ వైష్ణవి ప్రతిభా పురస్కారాల వితరణ!

Warangal: ఈరోజు శివనగర్ లోని శ్రీ వైష్ణవి సంఘం వరంగల్ ప్రతిభ పుష్కరాలను సభ అధ్యక్షులు వెలుగులేటి సేనాచార్యులు వహించగా అతిథులుగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి శ్రీమాన్ దరఖాశయం కటూరి ఇందుమతి కందల కృష్ణమాచార్యులు రాష్ట్ర వైష్ణవ సంఘ ఉపాధ్యక్షులు దరిపెళ్లి సంపత్ వెంకటరమణ తో పాటు శ్రీ వైష్ణవి సభ్యులు కాటూరి శ్రవణ్ కుమార్ హరిత లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అతిధుల చేత వైష్ణవ పురస్కార విద్యార్థులకు నగదు తోపాటు శాల్వా షీల్డ్ అందించారు రాజనాల శ్రీహరి దరిపల్లి సంపత్ మాట్లాడుతూ అయోధ్య విగ్రహాలను ఐదువేల విగ్రహాలు ను శ్రీ రామానుజ చార్యులు నాలుగేళ్ల విగ్రహాలను భక్తులకు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి వైష్ణవ కులానికి మంచి పేరు తేవాలని, పిల్లలు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించి మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలని రాజనాల శ్రీహరి తెలిపారు ఈ కార్యక్రమంలో వైష్ణవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దరిపెళ్లి సంపత్ పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST