Wardhannapet: వర్ధన్నపేటలో ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం!
Wardhannapet: వర్ధన్నపేటలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి, సర్పంచ్‌ల నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Wardhannapet: వర్ధన్నపేటలో ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం!
Wardhannapet: ఉపసర్పంచ్‌లు 7 రోజుల్లో సంతకం చేయకపోతే కలెక్టర్ గారు విచారించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది… మరి సర్పంచ్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే. గ్రామ పంచాయతీ నిధులు ప్రజల సొమ్ము.
ఆ నిధులను తమ ఇష్టానుసారంగా ఖర్చు చేసి, వాస్తవంగా పనులు చేయకుండానే బిల్లులు రాసుకుంటే, అలాంటి సర్పంచ్‌లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.
ఉపసర్పంచ్‌లకు ఒక నిబంధ సర్పంచ్‌లకు మరో నిబంధనా?గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనానికే ఖర్చు కావాలి.నిధుల దుర్వినియోగం, తప్పుడు బిల్లులు, నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
సర్పంచ్ అయినా ఉపసర్పంచ్ అయినా ప్రజాధనం విషయంలో ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలి.
తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రెస్ నోట్ విడుదల చేసి, సర్పంచ్‌లు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు రాసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు తెలియజేయాలి. అని ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫోరం ప్రధాన కార్యదర్శి మునావత్ శంకర్ నాయక్, గౌరవ అధ్యక్షులు కాటారి బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రవి ఉపాధ్యక్షులు చీర నాగరాజు కుంభం లలిత, సహాయ కార్యదర్శి బుక్య శ్రీనివాస్,నవీన్, అధికార ప్రతినిధి మచ్చ రమేష్ కోశాధికారి కల్మికొండ బొంద్యాలు, లక్ష్మణ్ మరియు వివిధ గ్రామాల ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.




