Hanamkonda: పేద విద్యార్థులకు అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్!
Hanamkonda: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులు 463 మంది పరీక్ష ఫీజు రూ.57,875 ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా చెల్లించారు.
Hanamkonda: పేద విద్యార్థులకు అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్!
హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 463 మంది విద్యార్థినీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష ఫీజు మొత్తం రూ.57,875/- ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు స్వయంగా చెల్లించడం అభినందనీయం. ఈ విషయానికి సంబంధించిన వివరాలను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ రవి గారికి భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కోలను సంతోష్ రెడ్డి గారు అందజేశారు.
ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే గొప్ప సంకల్పంతో బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్న సేవలు అభినందనీయం.
ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి సర్పంచ్ మరియు సిద్ధిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మాచర్ల కుమారస్వామి, భీమదేవరపల్లి మండల బీజేపీ అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్, BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.




