Jangaon: జనగామలో బైక్ దొంగల అరెస్ట్.. 9 బైక్‌లు, ఆటో స్వాధీనం!
Jangaon: జనగామ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఆటో, 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Jangaon: జనగామలో బైక్ దొంగల అరెస్ట్.. 9 బైక్‌లు, ఆటో స్వాధీనం!
Jangaon: జనగామ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న హైదరాబాద్ కు చెందిన నాగరాజు యాదవ్, మువ్వ అమల్ ఇద్దరు నిందితులను జనగామ పోలీసు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి ఒక ఆటో మరియు తొమ్మిది బైక్ ను స్వాధీనం చేసుకొన్నారు.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నట్లు ఏసిపి బీంశర్మ వెల్లడించారు.
నిదితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ సుమన్ ను సీపీ శ్వేత, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినదించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.




