Jangaon: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ TUWJ ఆధ్వర్యంలో ర్యాలీ!

Jangaon: జనగామలో IJU పిలుపు మేరకు TUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 2 Oct 2026 5:25 PM IST
Jangaon
X

Jangaon: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ TUWJ ఆధ్వర్యంలో ర్యాలీ!

Jangaon: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

జనగామ గాంధీ చౌరస్తా నుంచి జర్నలిస్టులు ర్యాలీగా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తిపరమైన భద్రత, ఉద్యోగ భద్రత, సామాజిక మరియు ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, జర్నలిస్టుల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.

కార్యక్రమంలో TUWJ జనగామ జిల్లా అధ్యక్షులు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పార్నంది వెంకటస్వామి, జిల్లా కోశాధికారి ఓరుగంటి సంతోష్ , శ్రీబాష్యం శేషాద్రి, కొత్తపల్లి కిరణ్, కన్న పర్శరాములు, కెమిడి ఉపేందర్, గణేష్, జంపాల శ్రీనివాస్, శశిధర్, రాణాప్రతాప్, తిప్పారపు ఉపేందర్, రహమాన్, మండల మోహన్, ఆకుల మహేశ్, నాసగోని శ్రీనివాస్, లావు జైపాల్ రెడ్డి, యండి ఎజాజ్, బట్టమేకల రాజు, మణి, పాలబిందెల రవీందర్, అశీష్, బాలు, అంకుశ్, శ్రీను, జితేందర్, సోమేష్, చింతకింది కిష్టమూర్తి, శివరాం, పర్శరామ్, బాస్కర్, సాగర్, మదు, నవీన్, వేణుగోపాల్, మోహన్, కిరణ్, శ్రీను, ఓంకార్, బాస్కర్, ఎల్లయ్య, నరేష్,గోవర్ధన, బాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON