Namiligonda: నమిలిగొండలో విషాదం: 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Namiligonda: నమిలిగొండలో 13 ఏళ్ల మోడల్ స్కూల్ విద్యార్థి గుండె రుత్విక్ ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

V Ravikiran, Jangaon
Published on: 27 Oct 2026 8:48 PM IST
Namiligonda
X

Namiligonda: నమిలిగొండలో విషాదం: 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

నమిలిగొండ: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండె సంపత్‌ స్వప్న దంపతుల కుమారుడు గుండె రుత్విక్‌ (13) సోమవారం ఇంట్లో ఉరే సుకుని మృతి చెందాడు. రుత్విక్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మోడల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతికి గల కారణాలు తెలి యాల్సి ఉంది.

తల్లి గుండె స్వప్న ఫిర్యాదు ప్రకారం..సోమవారం (26వ తేదిన ) ఉదయం 8.45 గంటలకు రుత్విక్‌ పాఠశాలకు వెళ్లాడు. తల్లి ఉదయం 9.30 గంటలకు కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో కుమారుడిని పిలిచినా స్పందించలేదు. కిటికీలో నుంచి చూడగా ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించా డు.

ఆమె కేకలు వేయడంతో ఎదురింటికి చెందిన చిక్కుడు వెంకటేష్‌, కోల వెంకటేష్‌ అక్కడికి చేరుకుని కిటికీని పగులగొట్టి లోపలికి వెళ్లి తలు పులు తెరిచారు. అనంతరం రుత్విక్‌ను కిందకు దించగా అప్పటికే మృ తి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ప్రైవేట్‌ అంబులెన్స్‌లో జన గామ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని, మృతికి గల కారణాలు తెలుసుకునేం దుకు పోస్టుమార్టం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లి స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఘన్ పూర్ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon