Mahabubabad: మహబూబాబాద్‌లో అంగన్‌వాడీలకు 'తొలిముద్ద' ప్రారంభం
Mahabubabad: మహబూబాబాద్‌లో అంగన్‌వాడీ చిన్నారుల కోసం 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో అంగన్‌వాడీలకు 'తొలిముద్ద' ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం లో అంగన్వాడీ విద్యార్థులకు తొలిముద్ద ( అల్పాహారం ) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , ఎమ్మెల్యే డాక్టర్. మురళీ నాయక్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహా శబరీష్ మాటాడుతూ.....రాష్ట్రం లోని 5 జిల్లాల్లో తొలిముద్ద కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారని , అందులో మహబూబాబాద్ జిల్లా ఉండటం మన అదృష్టమని , జిల్లా లోని 1488 అంగన్వాడీ సెంటర్ల లో గల సుమారు 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల 15,000 వేల మంది చిన్నారులకు తొలిముద్దు పేరుతో ఉదయం అల్పాహారం ప్రారంభించామని , పైలెట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లా ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కలకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ.... ఉదయమే పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని , చిన్నపిల్లలు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడి పిల్లలకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి , జిల్లా మహిళా , స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిని శిరీష్ , అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.




