Parkal: పరకాల మండలం మల్లక్కపేటలో హనుమాన్ దేవాలయంలో చోరీ!

Parkal: హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట హనుమాన్ దేవాలయంలో దొంగతనం. తాళాలు పగలగొట్టి హుండీ నగదు ఎత్తుకెళ్లిన దుండగులు, భయాందోళనలో భక్తులు.

M PRABHAKAR, PARAKAL
Published on: 27 Sept 2026 10:38 AM IST
Parkal
X

Parkal: పరకాల మండలం మల్లక్కపేటలో హనుమాన్ దేవాలయంలో చోరీ!

Parkal: మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం పూజల నిమిత్తం ఆలయానికి వచ్చిన అర్చకుడు, మరియు సిబ్బంది తాళాలు విరిగి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పరకాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంలో సీసీ కెమెరాలు పని సరే సరే అన్నా చేయకపోవడంతో వివిధ కోణాలలో పరిశీలిస్తున్నారు. దేవాలయంలో మరోసారి దొంగతనం జరగడంతో గ్రామంలో భక్తుల్లో ఆందోళన నెలకొంది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL