Gudur: గూడూరులో టీజీటీటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక, ఉపాధ్యాయుల డిమాండ్లు!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో తెలంగాణ గిరిజన టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక, జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్.
Gudur: గూడూరులో టీజీటీటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక, ఉపాధ్యాయుల డిమాండ్లు!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన టీచర్స్ ఫెడరేషన్ (TGTTF) మండల నూతన కమిటీ ఎన్నిక ఘనంగా నిర్వహించబడింది. TGTTF రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంగోత్ ధర్మా నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గూడూరు మండల నూతన కార్యవర్గం అధ్యక్షులు హంసావత్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు డాక్టర్ వాంకుడోత్ గోపినాథ్, ప్రధాన కార్యదర్శి బానోత్ రవి, మండల మహిళా ఉపాధ్యక్షురాలు బోడ ఝాన్సీ రాణి, మహిళా జనరల్ సెక్రెటరీ బానోత్ విజయ, మండల కోశాధికారి బానోతు రాజ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రూప్లా, లను నియమించారు.
ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బానోతు మంగీలాల్, జిల్లా ఉపాధ్యక్షులుగా బానోతు వీరన్న, బోడా మంగీలాల్, జిల్లా కార్యదర్శిగా ఇస్లావత్ చందా నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భూక్యా బాలు నాయక్, TGTTF CRT WING అధ్యక్షుడిగా తేజావత్ పూల్యా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు:సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారు కోరిన ప్రధాన ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలి. PRC ఫిట్‌మెంట్ 51% ప్రకటించాలి. PRC లో ఏజెన్సీ అలవెన్స్‌గా 10% AHRA, SCA రూ. 6000 పెంచాలి.
సీపీఎస్ (CPS) రద్దు చేసి ఓపీఎస్ (OPS) ను అమలు చేయాలి. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్, PET పోస్టులను అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి. సీఆర్‌టీ (CRT) లను వెంటనే రెగ్యులర్ చేయాలి. MIS, CCO, CRP, KGBV CRT లను క్రమబద్ధీకరించాలి.
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. గిరిజన గురుకులాల్లో పార్ట్ టైమ్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి 12 నెలల వేతనం అందించాలి. ఈ కార్యక్రమంలో TGTTF రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అజ్మీరా వీరు నాయక్, శ్రీనివాస్ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




