Jangaon: జనగామ జిల్లా దేవరుప్పులలో తీవ్ర ఉద్రిక్తత బీజేపీ రాస్తారోకో!

Jangaon: దేవరుప్పులలో దేవాదుల నీటి కోసం బీజేపీ రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం దిష్టిబొమ్మ దహనం ವೇಳೆ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి.

S MAHENDER, PALAKURTHI
Published on: 24 Oct 2026 4:01 PM IST
Jangaon
X

Jangaon: జనగామ జిల్లా దేవరుప్పులలో తీవ్ర ఉద్రిక్తత బీజేపీ రాస్తారోకో!

​Jangaon: జనగామ జిల్లా దేవరుప్పులలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది! దేవాదుల ప్రాజెక్టు ద్వారా రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన... బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణకు దారితీసింది.

దేవరుప్పుల మండల కేంద్రంలో సూర్యాపేట-జనగామ ప్రధాన జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో రహదారిపై కొంతమేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దిష్టిబొమ్మను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

అయితే, అప్పటికే డీజిల్‌తో తడిపి ఉన్న ఆ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి! ఈ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసుల చేతులకు మంటలు అంటుకుని స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన మంటలను అదుపులోకి తెచ్చారు . అనంతరం ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం దేవరుప్పుల పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI