Hanamkonda: హనుమకొండలో మున్నూరు కాపు పటేల్ సంఘం వెబ్‌సైట్ ప్రారంభం!
Hanamkonda: తెలంగాణ మున్నూరు కాపుల సంఖ్యా బలాన్ని చాటేందుకు హనుమకొండలో సభ్యత్వ నమోదు వెబ్‌సైట్‌ను రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ లాంఛనంగా ప్రారంభించారు.
Hanamkonda: హనుమకొండలో మున్నూరు కాపు పటేల్ సంఘం వెబ్‌సైట్ ప్రారంభం!
హనుమకొండ, అక్టోబర్ 10: హనుమకొండలో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు వెబ్ సైట్ ను రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్యా బలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు ఈ వెబ్ సైట్ ను ప్రారంభించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీకైనా మున్నూరు కాపుల సంఖ్య కీలకంగా మారుతుందని దానిని తెలియజేయడానికే ఈ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచిలుకు మున్నూరు కాపుల సంఖ్య ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 లక్షలుగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 14 లక్షలకు పడిపోవడం ఏంటని ప్రశ్నించారు. మున్నూరు కాపు ఓటు రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలకమని అన్ని పార్టీలు గుర్తించేలా అందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.




