Seethakka: పంచాయతీలకు GPSAP-2026: మంత్రి సీతక్క కీలక ముందడుగు!
Seethakka: దేశంలోనే తొలిసారిగా ప్రతి పంచాయతీకి ఐదేళ్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP-2026)ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Seethakka: పంచాయతీలకు GPSAP-2026: మంత్రి సీతక్క కీలక ముందడుగు!
సీతక్క: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రతి గ్రామపంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, ప్రతి గ్రామానికి సమగ్ర డేటా.. రాబోయే ఐదేళ్ల అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ, మంత్రి సీతక్క ఆలోచన, ఆదేశాల మేరకు GPSAP-2026 రూపకల్పన, గ్రామ జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి, గృహవసతి, పశుసంపద, ప్రభుత్వ పథకాల వివరాలతో గ్రామ సమగ్ర ప్రొఫైల్ మూడు నుంచి ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక.. ప్రస్తుత ఏడాదికి ప్రత్యేక వార్షిక కార్యాచరణ.
గ్రామ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా అభివృద్ధి పనుల ఎంపిక, వివిధ శాఖల సమన్వయం తో అభివృద్ధి పనులు, ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డాష్‌బోర్డు ఏర్పాటు లక్ష్యం, ప్రతి నెలా గ్రామపంచాయతీ సమావేశంలో GPSAPపై సమీక్ష.
పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అధికారులకు బాధ్యతలు.. సమాచారం ఇవ్వని, తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు, తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి.. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రణాళికాబద్ధమైన పాలన లక్ష్యంగా GPSAP, ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ.




