Warangal: శ్రీ భద్రకాళి ఆలయంలో హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ప్రత్యేక పూజలు!
Warangal: వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్, ఐఏఎస్. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు.
Warangal: శ్రీ భద్రకాళి ఆలయంలో హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ప్రత్యేక పూజలు!
వరంగల్: వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈరోజు సాయంకాలం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ శ్రీ వి.పి గౌతమ్, I A S., కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీ గౌతమ్ గారికి అర్చకులు అధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు.




