Parkal: పరకాలలో వైభవంగా స్వర్ణకార సంఘం శరన్నవరాత్రులు.. అమ్మవారి చీర వేలం
Parkal: పరకాల పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారి చీరను బెజ్జంకి పూర్ణాచారి వేలంలో దక్కించుకున్నారు.
Parkal: పరకాలలో వైభవంగా స్వర్ణకార సంఘం శరన్నవరాత్రులు.. అమ్మవారి చీర వేలం
పరకాల: పరకాల పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
నవరాత్రులు ముగించుకొని చివరి రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నవరాత్రులు ధరించిన అమ్మవారి చీరను వేలం వేయగా, స్థానిక 9వ వార్డు కౌన్సిలర్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జంకి పూర్ణాచారి అమ్మవారి చీరను వేలంలో దక్కించుకున్నారు. అమ్మవారి నిండు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యగారు కరుణాకర్ శాస్త్రి, కందుకూరి వేణు, గుగ్గిళ్ళ రాజు, గుగ్గిళ్ళ సత్యం, తంగళ్ళపల్లి దేవేందర్, వంగల రమేష్, శివారపు రాజు, పొడిశేట్టి దేవేందర్ చారి, కన్నోజ్ శరత్, లోకేష్, రామగిరి చంద్రమౌళి, పొడిశెట్టి రవి, రుద్రోజ్ మోహన్, నాగేంద్ర చారి, పొడిశెట్టి రాము, ఆజీ మియా, వంగల సుజాత, తంగేళ్లపల్లి దీపిక, శారద, పవిత్ర, లత, లక్ష్మి, లావణ్య, వాసవి, సుప్రజ, పావని, రాధిక, అమూల్య, విజయ, అమ్ములు తదితర కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




