Parkal: పరకాలలో మృతురాలి కుటుంబానికి స్వర్ణకార సంఘం ఆర్థిక, సరుకుల సాయం!
Parkal: పరకాలలో అకాల మరణం చెందిన స్వర్ణకార సంఘ సభ్యుని తల్లి కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేసి పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు.
Parkal: పరకాలలో మృతురాలి కుటుంబానికి స్వర్ణకార సంఘం ఆర్థిక, సరుకుల సాయం!
Parkal: ఇటీవల అనారోగ్య కారణంతో అకాల మరణం చెందిన స్వర్ణకార సంఘ సభ్యుడు జంబూకం రమేష్ తల్లి జంబూకం వెంకట నరసమ్మ (60) మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్వర్ణకార సంఘం సభ్యులు ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో సంఘం తరఫున బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. అన్ని వేళలా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు బెజ్జంకి పూర్ణాచారి, ప్రధాన కార్యదర్శి మారుపాక విజయ్ కుమార్, కోశాధికారి మంగళ రమేష్, ఉపాధ్యక్షులు ఉద్రోజు ఉత్తమ్ కుమార్, యూత్ వైస్ ప్రెసిడెంట్ మునిగంటి విద్యాసాగర్, సంయుక్త కార్యదర్శి కడార్ల సందీప్, ప్రచార కార్యదర్శి కందుకూరి రంజిత్, సహాయ కార్యదర్శి కందుకూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.




