Mahabubabad: డోర్నకల్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. భూక్యా శాంతిగా గుర్తింపు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

P PRABHAKAR, DORNAKAL
Published on: 29 Sept 2026 9:26 AM IST
Mahabubabad
X

Mahabubabad: డోర్నకల్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

మృతురాలిని డోర్నకల్ మండలం లింబ్యతండాకు చెందిన భూక్యా శాంతి (65)గా గ్రామస్తులు గుర్తించారు. ఆమె భర్త పేరు బిచ్చా అని తెలిపారు. మహిళ మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు, పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL