Rayaparthy: రాయపర్తిలో తీవ్రమవుతున్న వీధికుక్కల బెడద భయాందోళనలో ప్రజలు!
Rayaparthy: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాయపర్తి మండలంలో పెరుగుతున్న వీధికుక్కల బెడద. గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కుక్కలు.
Rayaparthy: రాయపర్తిలో తీవ్రమవుతున్న వీధికుక్కల బెడద భయాందోళనలో ప్రజలు!
Rayaparthy: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంతో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు రోడ్లపైకి వచ్చి వాహనదారులు, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రహదారిపై ఒక్కసారిగా కుక్కల గుంపులు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో పరిస్థితి మరింత భయానకంగా ఉంటోందని, గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వెంటపడటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం భయపడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.రాయపర్తిలోని పలు కాలనీలు, వీధుల్లో ఏ వాడ చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు రోడ్లపై నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారని .అధికారులు స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి, ప్రజలకు భయాందోళనలు లేకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.




