Station Ghanpur: అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో ఐదో స్థానం సాధించిన కేసోజు యశ్వంత్ చారి

Station Ghanpur: చైనాలో 25 దేశాల మధ్య జరిగిన అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన కేసోజు యశ్వంత్ చారి 5వ స్థానం సాధించి ప్రతిభ చాటారు.

V Ravikiran, Jangaon
Published on: 10 Oct 2026 7:15 PM IST
Station Ghanpur
X

Station Ghanpur: అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో ఐదో స్థానం సాధించిన కేసోజు యశ్వంత్ చారి

స్టేషన్ ఘన్‌పూర్: చైనాలో 25 దేశాల మధ్య జరిగిన అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కేసోజు యశ్వంత్ చారి ఐదో స్థానం సాధించి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకున్నారు.

ఈ ఘనతతో గ్రామానికి, దేశానికి గర్వకారణంగా నిలిచారు.కేసోజు యాదగిరి, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడైన యశ్వంత్ చారి, బ్రహ్మం మనవడిగా కుటుంబ నేపథ్యంతో పాటు తన వృత్తి నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎంపికైన ఆయన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నారు.

సాంప్రదాయ వృత్తులు క్రమంగా కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో, వడ్రంగి వృత్తిపై ఆసక్తి, పట్టుదల, నైపుణ్యం ఉంటే ప్రపంచ స్థాయిలోనూ గుర్తింపు సాధించవచ్చని యశ్వంత్ చారి నిరూపించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన విజయం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon