Station Ghanpur: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం
Station Ghanpur: స్టేషన్ ఘనపూర్‌లో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పరిచయ వేడుక. 24 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
Station Ghanpur: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం
స్టేషన్ ఘనపూర్: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం మరియు మండల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులకు కండువాలు కప్పి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అంతకుముందు స్టేషన్ ఘనపూర్ మండలంని వివిధ గ్రామాలకు సంబందించిన 24మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 14లక్షల 28వేల 500రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పంపిణి చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.... ఏ రాజకీయ పార్టీకైనా గ్రామ స్థాయి నాయకులతో సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు. పార్టీకి నాయకత్వం బలంగా ఉంటే అధికారంలోకి వస్తాం పార్టీ అధికారంలో ఉంటే మనం బలంగా ఉంటామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం కల్పించిందని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న, రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న, రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పార్టీ పటిష్టం చేసుకోలని పేర్కొన్నారు.
కొత్త పాత అనే ఆలోచనలు రావద్దని అందరం సమిష్టిగా పని చేయడంతో పాటు మనతో కలిసివచ్చే వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు. మన లక్ష్యం ఒక్కటేనని రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
ఇందుకు ప్రతీ కార్యకర్త నిబద్దతతో పని చేయాలని అన్నారు. పార్టీలోనే ఉంటూ స్వంత పార్టీకి, స్వంత నాయకులకు వ్యతిరేకంగా పని చేస్తే మాత్రం సాహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా పార్టీ నిబంధనలకు, క్రమశిక్షణకు కట్టుబడి పని చేయాల్సిందేనని వెల్లడించారు.
బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్యపు ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. బిఆర్ఎస్ అధికారాన్ని, ధరణిని అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రైతులను అడ్డుపెట్టుకొని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రం లో నదులలో, జలషయాలలో నీళ్లు లేవని తెలిసిన అబద్దపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్నారని అన్నారు. వానాకాలం పంటలను కాపాడే బాధ్యత మాదని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు తో ఎం కాదని దానికి కొంత మంది పిండ ప్రదానం కూడా చేశారని అన్నారు.
కానీ ఈ రోజు పిండ ప్రదానం చేసిన ప్రాజెక్టే వేలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తూ పాడి పంటలు పండిస్తుందని ఒక రాజకీయ నాయకునికి ఇంతకన్నా సంతృప్తి ఇచ్చే విషయం ఏముంటుందని పేర్కొన్నారు. నాకున్న ఏకైక లక్ష్యం, ఏకైక ఆలోచన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే నని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్దే వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




