Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
Station Ghanpur: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొని ప్రసంగించారు.
Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
స్టేషన్ ఘనపూర్: జనగామ జిల్లా లోని స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం ద్వారా పేదల ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాడు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని వేల ఎకరాల్లో భూములను దోచుకున్నారు.
నేడు అధికారం కోల్పోయిన తర్వాతకి మా ఆదాయం ఎటుపోయాను అంటూ ఆందోళన చెందుతున్నారు. పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని సూచించారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ వల్ల చాలాచోట్ల లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి కానీ మన దగ్గర జాగ్రత్తగా ఓట్లు కాపాడుకున్నాం .
సర్ ప్రక్రియ ద్వార కోలిపోతున్న ఓట్ల గురించి మొన్న కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదొ తెలియదు. బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. రాబోయే రోజులలో సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ రెండు పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని తెలిపారు. ఆ పార్టీలకు బుద్ధి చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సూచించారు.




