Wardhannapet: దీపావళి పర్వదినాన నేతకాని కులస్తుల ప్రత్యేక బతుకమ్మ సంబరాలు

Wardhannapet: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో దీపావళి పర్వదినాన నేతకాని కులస్తులు నిర్వహించిన ప్రత్యేక బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 8:06 PM IST
Wardhannapet
X

Wardhannapet: దీపావళి పర్వదినాన నేతకాని కులస్తుల ప్రత్యేక బతుకమ్మ సంబరాలు

హనుమకొండ జిల్లా: హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నేతకాని కులస్తులు ప్రత్యేక బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న తమ ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి,పాల్గొని బతుకమ్మ వేడుకలను తిలకించి,వేడుకల్లో పాల్గొన్నారు.దీపావళి పండుగ వేళ ప్రత్యేకంగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలతో సీతంపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ... తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రత్యేకంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దీపావళి పర్వదినాన ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చి, పూజలు నిర్వహిస్తూ, సంప్రదాయ పాటలు, ఆటలతో వేడుకలు జరుపుకోవడం మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రతి కులం, ప్రతి సమాజానికి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయని, వాటిని గౌరవిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన పూర్వీకులు అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం ద్వారా మన మూలాలను, మన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోగలమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల అశోక్,మండల మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి,66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్,సీనియర్ నాయకులు,మండల ముఖ్య నాయకులు,సర్పంచులు, నేతకాని కులస్తులు, గ్రామ పెద్దలు,గ్రామ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్