Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఎస్పీ శబరీష్, కలెక్టర్ స్నేహా శబరీష్ల నివాళులు.
Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణం లో జిల్లా ఎస్పీ శబరీష్ , జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ లు విధి నిర్వహణ లో అసువులు భాసిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్మృతి పరేడ్ లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21 న భారత్ చైనా సరిహద్దు లడక్ లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతం లో చైనా సైనికులు జరిపిన దాడి లో అసువులు బాసిన 10 మంది సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల త్యాగాలకు ప్రతీకగా అక్టోబర్ 21 వ తేదీ న ... దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసులు బాసిన పోలీసులను స్మరిస్తూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటామని ,
ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 154 మంది పోలీసులు వీర మరణం పొందారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ , నేరాల నియంత్రణ , మహిళలు చిన్న పిల్లలకు రక్షణ , ప్రకృతి వైపరీత్యాలు , ఆపద ల సమయం లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుంటారని , అమరవీరులు ఆశించిన విధంగా తమ విధులను నిర్వహిస్తూ , స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికి తారతమ్యం లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమం లో డీఎస్పీలు , సీ.ఐలు , ఎస్.ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




