Rayaparthi: అధికారిక లాంఛనాలతో ఎస్సై వెంకన్న అంత్యక్రియలు
Rayaparthi: విధి నిర్వహణలో మృతి చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న అంత్యక్రియలు రాయపర్తి మండలం కిష్టాపురంలో అధికారిక పోలీసు లాంఛనాలతో ఘనంగా నిర్వహణ.
Rayaparthi: అధికారిక లాంఛనాలతో ఎస్సై వెంకన్న అంత్యక్రియలు
రాయపర్తి: రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకన్న హైదరాబాదులోని వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కిష్టాపురానికి తీసుకురాగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న మృతిపట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెంకన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తో పాటు పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించి వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




