Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్‌లో షీ టీమ్స్ అవగాహన సదస్సు: మహిళల రక్షణే ధ్యేయం!

Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివన్‌పల్లిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రత, టీ-సేఫ్ యాప్ మరియు సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 6 Oct 2026 6:24 PM IST
Station Ghanpur
X

Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్‌లో షీ టీమ్స్ అవగాహన సదస్సు: మహిళల రక్షణే ధ్యేయం!

Station Ghanpur: 06-10-2026న Shivanpally, Station Ghanpurలో She Teams ద్వారా మహిళలు మరియు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు బాలికల భద్రత, వేధింపులు, Stalking, అనుకోని పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సమస్యలు ఎదురైనప్పుడు పోలీసుల సహాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు.

బస్సుల్లో, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఎవరైనా మహిళలు లేదా బాలికలను ఇబ్బందులకు గురిచేసినా, వేధించినా లేదా ఏదైనా సమస్య ఎదురైనా She Teamsను సంప్రదించి సహాయం పొందవచ్చని వివరించారు.

అలాగే T-Safe App గురించి, మహిళల భద్రతకు సంబంధించిన దాని ఉపయోగాలు మరియు సేవల గురించి అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు మరియు ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే Cyber Crime Toll-Free Helpline No. 1930కు ఫోన్ చేయాలని, National Cyber Crime Reporting Portal: www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని వివరించారు.

మహిళలు మరియు బాలికలు తమకు ఎదురయ్యే సమస్యలను She Teams దృష్టికి తీసుకురావడానికి CI, She Teams WhatsApp No. 8712685142కు సమాచారం అందించవచ్చని తెలిపారు. మహిళలు మరియు బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా She Teamsను సంప్రదించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.