Warangal: సోషల్ మీడియాలో జాగ్రత్త అవసరం: వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు!

Warangal: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 4 Oct 2026 4:32 PM IST
Warangal
X

Warangal: సోషల్ మీడియాలో జాగ్రత్త అవసరం: వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు!

వరంగల్: నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు అన్నారు.

వరంగల్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్ లో దాదాపు 70మంది విద్యార్థినిలతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు.

ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని మరియు మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరు టీ-సేఫ్ ఆప్ ను ఉపయోగించుకోవాలని, టీ-సేఫ్ ఆప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు.

ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టైతే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు.

సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి ఫిర్యాదు చేయాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ గారి వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో GOVT పాలిటెక్నిక్ ఉమెన్ హాస్టల్ ప్రిన్సిపాల్ సరస్వతి మరియు షీ టీమ్ ఎస్సై రామారావు గారు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.