Hanumakonda: విద్యా రంగ సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం!

Hanumakonda: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ విమర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 1:59 PM IST
Hanumakonda
X

Hanumakonda: విద్యా రంగ సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం!

Hanumakonda: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు బుధవారం రోజున మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ శాయంపేట మండల నూతన కమిటీని 11 మందితో ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటివరకు రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 8, వేల కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్ మెంట్ పెండింగ్లో ఉందన్నారు పూర్తిగా విద్య రంగ సమస్యలను పట్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక అడుగు వేసింది అన్నారు విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా రాష్ట్రంలో అమలు కాలేదు అన్నారు రాబోయే ఎన్నికలలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో విద్యార్థులు తమ ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్తారు అన్నారు.

ఎస్ఎఫ్ఐ శాయంపేట మండలం నూతన కమిటీ ఎన్నిక మండల అధ్యక్షులుగా, MD, ఇస్మాయిల్, మండల కార్యదర్శిగా

మంద మణిదీప్, మండల ఉపాధ్యక్షులుగా మంద ప్రణయ్, బైరి సాయి.

మండల సహాయ కార్యదర్శులుగా భాషబోయిన శశి, MD, సమీర్, మండల కమిటీ సభ్యులుగా జస్వంత్, సిద్ధార్థ, వరుణ్, అభి, రితీష్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్