Hanamkonda: హన్మకొండలో ఘనంగా ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల కరపత్రాల ఆవిష్కరణ!
Hanamkonda: నవంబర్ 25, 26, 27 తేదీలలో జరగనున్న ఎస్ఎఫ్ఐ హనుమకొండ నాలుగో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
Hanamkonda: హన్మకొండలో ఘనంగా ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల కరపత్రాల ఆవిష్కరణ!
Hanamkonda: ఈ నెల నవంబరు 25, 26,27, తేదీలలో హనుమకొండ నగరంలో జరిగే ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా 4, వ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ని నియమించలేదన్నారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల హాస్టల్స్ లలో చదువుకునే విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు SMH కాలేజీ ,హాస్టల్స్ కు కూడా సొంత భవనాలు లేవన్నారు అద్దె భవనాల్లో ఉంటూ విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్య రంగ సమస్యలను పరిష్కరించడం లో వెనకడుగు వేస్తుంది అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8,154 కోట్ల స్కాలర్ షీప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉందన్నారు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకుందామంటే వారి సొంత డబ్బులు కట్టి తీసుకుంటున్నారన్నారు ఈ మహాసభల్లో హనుమకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా రంగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకొని విద్యా రంగ సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామన్నారు.
ఈ మాహసభల విజయవంతం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించి విజయవంతం చేయలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ , జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్ ,జిల్లా కమిటీ చెన్నూరి సాయికుమార్ మాసాని ప్రదీప్, సాల్మన్ రాజ్ , నాగరాజ్, అనుఫు భాను ప్రసాద్ ,మణిదీప్, రాజ్ కుమార్, నవీన్ సాయి, రణదీప్, తదితరులు పాల్గొన్నారు.




