Garla: నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డికి వినతి!
Garla: నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా గార్లలో గురువారం సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు.
Garla: నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డికి వినతి!
మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలం కేంద్రంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ యువజన ఐక్యవేదిక యువజన ఐక్యవేదిక కోఆర్డినేటర్ జంపాల కార్తీక్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ వినతుల వారోత్సవం" అధికారికంగా ప్రారంభమైంది. యువజన ఐక్యవేదిక కోఈ కార్యక్రమానికి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది జంపాల విశ్వ ముఖ్య అతిథిగా పాల్గొని
ఈ సందర్భంగా జంపాల విశ్వ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CMO) మెయిల్ ద్వారా నాయి బ్రాహ్మణుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పంపించి వారోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశ్వజంపాల మాట్లాడుతూ రాష్ట్రంలో 4.33 లక్షలకు పైగా (1.2%) ఉన్న నాయి బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ ప్రధాన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని విశ్వ అన్నారు
నాయి బ్రాహ్మణ సంక్షేమ పథకాల అమలు కోసం వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పూర్తిస్థాయి పాలకమండలిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేలకు పైగా సెలూన్ షాపుల ఆధునీకరణ, వృత్తిదారుల ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం ,సంక్షేమం కోసం ప్రతి ఏటా బడ్జెట్లో రూ. 1,000 కోట్లు కేటాయించాలి విశ్వ ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రాంత నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. కావున, ఎమ్మెల్సీ నియామకాలు, నామినేటెడ్ పదవులు మరియు రాబోయే ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించి రాజకీయంగా ప్రోత్సహించాలని విశ్వ విజ్ఞప్తి చేశారు,
రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులందరూ వ్యక్తిగతంగానూ, సంఘాల పేరుతోనూ పెద్ద ఎత్తున వినతి పత్రాలను ముఖ్యమంత్రికి పంపాలని పిలుపునిచ్చారు. మెయిల్, పోస్ట్, ప్రజావాణి (గ్రీవెన్స్) మరియు నేరుగా కలిసి వినతి పత్రాలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విశ్వ జంపాల నాయి బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గార్ల మండల అధ్యక్షులు జంపాల సతీష్, సీనియర్ నాయకులు మంగళగిరి మాధవ్, నిడిగొండ సాంబ, సురభి వెంకటేష్, జంపాల విజ్ఞాన్, సురభి సాయి తదితరులు పాల్గొన్నారు.




