Mahabubabad: మహబూబాబాద్‌కు చేరుకున్న సేవా సంకల్ప యాత్ర!

Mahabubabad: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని తిరుపతి నుంచి వారాణసీ వరకు సాగుతున్న ద్విచక్ర వాహన 'సేవా సంకల్ప యాత్ర' మహబూబాబాద్‌కు చేరుకుంది.

A.Rajkumar, Mahabubabad
Published on: 3 Oct 2026 4:01 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌కు చేరుకున్న సేవా సంకల్ప యాత్ర!

Mahabubabad: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన సేవా సంకల్ప యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. తిరుమల నుంచి వారాణసీ వరకు సాగుతున్న ఈ ద్విచక్ర వాహన యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

యాత్రకు టీడీపీ శ్రేణులు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి యాత్ర చేరుకున్న సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండపల్లి రామచందర్‌రావుతో పాటు టీడీపీ నేతలు, మహిళలు మంగళహారతులతో యాత్రికులకు ఘన స్వాగతం పలికారు.

తిరుపతి నుంచి వారాణసీ వరకు సాగుతున్న ఈ యాత్ర సుమారు 2,500 కిలోమీటర్ల మేర నాలుగు రాష్ట్రాల మీదుగా ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో

25 మంది కార్యకర్తలు 25 ద్విచక్ర వాహనాలతో ఈ సంకల్ప యాత్రను చేపట్టారని, తిరుపతి నుంచి ప్రారంభమైన యాత్ర... తెలంగాణ మీదుగా ఉత్తర భారతదేశం వైపు సాగుతూ వారాణసీలో ముగియనుందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రజాసేవను పురస్కరించుకునే ఈ యాత్రను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తోందని చెప్పారు.

25 మంది 25 ద్విచక్ర వాహనాలతో సుమారు 2,500 కిలోమీటర్ల మేర నాలుగు రాష్ట్రాలను దాటుకుంటూ ఎనిమిది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు.

ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అభినందిస్తూ వారాణసీ పర్యటన సందర్భంగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారని తెలిపారు.

సంకల్ప యాత్రలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రకు సంఘీభావం ప్రకటించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad